ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్-సూర్జాపూర్ శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో పవిత్ర ఆషాఢ మాసం చివరి మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక కుంకుమార్చనలు, అభిషేకాలు చేశారు.

అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు
అమ్మవారికి పంచామృతాభిషేకం, గాజులు, గోరింటాకు, నూతన వస్త్రాలంకరణలతో పాటు ఓడి బియ్యం, దీప ధూప నైవేద్యాల సేవలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం విచ్చేసిన భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ చేపట్టారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ విశేష పూజా కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీ దయానంద్, జిల్ల శ్రీనివాస్, వోల్లాల తిరుపతి గౌడ్, గ్రామ ప్రజాప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు మరియు గ్రామస్తులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.