East Godavari/Rajamahendravaram Rural (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 01
నిజామాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు మాక్లూర్ మండలం గుతపా గ్రామ సమీపంలోని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో జరిగిన వివాహ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుతపా గ్రామ సమీపంలోని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నిజామాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారి వెంకట్ కుమార్ స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ సన్నిధిలో జరిగిన వివాహ వేడుకలకు విఠల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మాదాపూర్ గ్రామానికి చెందిన డీఈఓ ఎస్యూపీ నిజామాబాద్ పడకంటి శ్రీనివాస్ రావు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి. కమలాకర్ రావు, పి. రమణారావు, పి. భాస్కర్ రావు, డి. హన్మంత్ రావు, డి. సంజీవ్ రావు, ఎం. కృష్ణ మోహన్ రావు, ఎం. ప్రకాష్ రావు (రిటైర్డ్ ప్రిన్సిపాల్), ఎస్. మాణికేశ్వర్ రావు, బి. కిషోర్ రావు, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.












