కుంటాల మండలం లోని లింబా (బి), కోతుల్ గాం, కుంసర గ్రామాల్లో ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు అయ్యాయని, టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. శుక్రవారం భైంసాలోని తన నివాసంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
లింబా బి గ్రామంలోని శివాలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు, కోతుల్ గ్రామంలోని బీరప్ప ఆలయానికి రూ. 10 లక్షలు, కుంసర గ్రామంలోని హనుమాన్ ఆలయానికి రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, ఇంచార్జి మంత్రికి, దేవాదాయ శాఖ మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.










