బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 14
బోథ్ మండలంలోని కన్గుట్ట గ్రామంలో నిర్వహించిన శ్రీ శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరిపై శబరిమాత ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
బోథ్ మండలంలోని కన్గుట్ట గ్రామంలో నిర్వహించిన శ్రీ శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖండ జ్యోతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శబరిమాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులతో కలిసి పల్లకి ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, గ్రామంలో ఆధ్యాత్మికత, భక్తి భావం మరింత పెంపొందాలని కోరుకున్నారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రాముఖ్యత
అనంతరం ఈ సందర్భంగా భక్తులతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆత్మీయంగా మాట్లాడుతూ.. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో శబరిమాత భక్తులే ఎక్కువగా ఉన్నారని, కన్గుట్ట గ్రామంలో ఇంత పెద్ద షెడ్డును ఆ శబరిమాతనే నాతో వేయించిందన్నారు. రానున్న రోజుల్లో కచ్చితంగా అన్ని గ్రామాల్లో గల శబరిమాత ఆశ్రమాలను అభివృద్ధి చేస్తానన్నారు.
భారీగా పాల్గొన్న భక్తులు
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












