నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లో మాల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా బస్తీవాసులందరూ ఐక్యంగా పాల్గొని భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకున్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సుభిక్షంగా పండాలని, ఎలాంటి కరువు పరిస్థితులు రాకుండా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. అలాగే ప్రజలకు ఎలాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా సమస్త ప్రాణకోటిని కాపాడాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
శుభాకాంక్షలు
ఈ సందర్భంగా మాల సంఘం నాయకులు నగర, జిల్లా ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మాల సంఘం నాయకులు ధనపాల్ సూర్యనారాయణ, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సక్కి విజయ్ కుమార్, 34వ డివిజన్ కార్పొరేటర్ పండు, మోటార్ గంగాధర్, ప్రభంజన్, సురేష్, మాడె శ్రీనివాస్, శ్యామ్, ఆనంద్, సంజీవ్, సుబ్బారావు, రాజు, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.











