బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 14
మద్యం సీసాలు, నగదు చోరీకి పాల్పడిన నిందితుడిని బోథ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగిలించిన బైక్‌పై తిరుగుతుండగా వాహన తనిఖీల్లో పట్టుబడిన నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన బైక్‌తో పాటు మూడు మద్యం సీసాలు, రూ.400 నగదు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన బోథ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే
బోథ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పొచ్చెర ఎక్స్‌రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి ప్రాంతానికి చెందిన శంకర్ మెరీబా నవేమార్ (35)గా గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా, సోనాల గ్రామంలోని వైన్‌షాపులో చోరీకి పాల్పడినట్లు వెల్లడించినట్లు బోథ్ సీఐ డి. గురుస్వామి తెలిపారు.
చోరీ తీరు
నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు, మహమూద్ అనే మరో వ్యక్తితో కలిసి సోనాల గ్రామంలోని వైన్‌షాపు షట్టర్‌ను ఐరన్ రాడ్‌తో పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి మద్యం సీసాలతో పాటు రూ.2,500 నగదును చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. చోరీకి ముందు సోనాల ప్రాంతంలో ఓ బైక్‌ను దొంగిలించి, అదే బైక్‌పై వైన్‌షాపు వద్దకు వెళ్లి చోరీకి పాల్పడినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు.
పోలీసుల అభినందన
అనంతరం చోరీ చేసిన బైక్‌పై వెళ్తుండగా పొచ్చెర ఎక్స్‌రోడ్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో పోలీసులకు చిక్కాడు. నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన బైక్, మూడు మద్యం సీసాలు, రూ.400 నగదు, మొబైల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు మహమూద్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ హఫీజ్, కానిస్టేబుల్ శ్రీకాంత్‌లను సీఐ డి. గురుస్వామి అభినందించారు.
దర్యాప్తు
బోథ్ ఎస్ఐ వి. పురుషోత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.