కడప, 2026-06-05
కడప జిల్లా వేంపల్లి మండలం కత్తులూరుకు చెందిన వెంకట ప్రసాద్ రెడ్డిని ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.6 లక్షలు వసూలు చేసి మోసం చేసిన మహిళ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కడపకు చెందిన ఎస్తర్ రాణి, వేంపల్లి మండలం కత్తులూరుకు చెందిన వెంకట ప్రసాద్ రెడ్డి మధ్య రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడిచింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.6 లక్షల వరకు వసూలు చేశాడని యువకుడు ఆరోపించారు.
వివరాల్లోకి వెళితే
పులివెందుల వెటర్నరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎస్తర్ రాణి, వెంకట ప్రసాద్ రెడ్డిని వివాహం చేసుకుంటానని నమ్మించింది. పెళ్లి బట్టల కోసం యువకుడితో కలిసి హైదరాబాద్లో షాపింగ్ కూడా చేసింది.
పెళ్లి రోజున మాయం
గండి క్షేత్రంలో పెళ్లి జరగాల్సిన రోజున, పెళ్లి చేసుకుంటే అమ్మ ఉరి వేసుకుంటుంది అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోయిందని బాధితుడు తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు
ఈ ఘటనపై వెంకట ప్రసాద్ రెడ్డి పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకున్న వేంపల్లి పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












