రాజుపాలెం, 2026-08-15
పల్ంగళాడు జిల్లా. రాజుపాలెం మండలం ఆగస్టు 15 మనోరంజని తెలుగు టైమ్స్ ఆర్.ఆర్. సెంటర్లో ప్రేమ వివాహం చేసుకుంగళ్ంగళ దంపతుల జీవితంలో వివాహేతర సంబంధం తీవ్ర విషాదాంగళ్ంగళి ంగళింపింది. భర్తంగళు హత్య చేసి, ఆ ఘటనోరంజనిగళు గ్యాస్ లీకేజీ ప్రమాదంగా చిత్రీకరించేందుకు భార్య ప్రయత్ంగళించింగళట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటంగళపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ంగళిందితులంగళు అదుపులోకి తీసుకుంగళ్ంగళారు.
పల్నాడు జిల్లా. రాజుపాలెం మండలం ఆగస్టు 15 మనోరంజని తెలుగు టైమ్స్ ఆర్.ఆర్. సెంటర్లో ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల జీవితంలో వివాహేతర సంబంధం తీవ్ర విషాదాన్ని నింపింది. భర్తను హత్య చేసి, ఆ ఘటనను గ్యాస్ లీకేజీ ప్రమాదంగా చిత్రీకరించేందుకు భార్య ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రేమ వివాహం, విభేదాలు
పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్.ఆర్. సెంటర్కు చెందిన పవన్ కుమార్, సంధ్యాబాయి ప్రేమించుకున్నారు. పవన్ కుమార్కు కుటుంబ సభ్యులు బంధువుల అమ్మాయితో వివాహం నిశ్చయించినప్పటికీ, అప్పటికే సంధ్యాబాయితో ప్రేమలో ఉన్న ఆయన పెద్దల నిర్ణయాన్ని కాదని 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడేళ్ల ప్రేమ్ కుమార్, ఆరేళ్ల దేవాస్ నాయక్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పవన్ కుమార్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే, కొంతకాలంగా సంధ్యాబాయి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు పవన్ కుమార్ బంధువులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం పవన్ కుమార్కు తెలియడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలిపారు.
ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం
వారం రోజుల క్రితం పవన్ కుమార్ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పవన్ కుమార్ తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంధ్యాబాయిని విచారించగా, భర్త మద్యానికి బానిసై గొడవ పడ్డాడని, అనంతరం ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయని ఆమె చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి గ్యాస్ లీకేజీకి సంబంధించిన ఎలాంటి స్పష్టమైన ఆనవాళ్లు కనిపించలేదు. మరోవైపు, పవన్ కుమార్కు చికిత్స అందించిన వైద్యులు గాయాల తీరును పరిశీలించి గ్యాస్ లీకేజీ వల్ల జరిగిన ప్రమాదంగా కనిపించడం లేదని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. దీంతో పోలీసులకు సంధ్యాబాయిపై అనుమానం బలపడింది.
బంధువుల అనుమానాలు, లోతుగా విచారణ
పవన్ కుమార్ బంధువులను పోలీసులు విచారించగా, సంధ్యాబాయి ప్రవర్తనపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు కూడా పోలీసులకు వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంధ్యాబాయిని అదుపులోకి తీసుకుని పోలీసులు లోతుగా విచారించారు. ఈ విచారణలో హత్యకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.
హత్య ఒప్పుకున్న భార్య












