మండల కేంద్రమైన ముథోల్ లోని డాక్టర్ రాజేశ్వర్ రావు హాస్పిటల్ సమీపంలో అనుమతి లేకుండా నిల్వ చేసిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
ఎస్సై బిట్ల పెర్సిస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో, డాక్టర్ రాజేశ్వర్ రావు హాస్పిటల్ ముందున్న ఓపెన్ ప్లాట్లలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులు బయటపడ్డాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నిల్వ చేసిన ఇసుకకు సంబంధించి ఎటువంటి అనుమతులు, రవాణా పత్రాలు లేవని గుర్తించారు. దీంతో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఆ ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు.
అనుమతి లేకుండా ఇసుక నిల్వ చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణా, నిల్వలను అరికట్టేందుకు పోలీసు, రెవెన్యూ శాఖలు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో, అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందించాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు.








