ఆగిరిపల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 19
ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలోని ఆగిరిపల్లిలో బిర్యానీ ధరలో రూ.10 తగ్గడంపై తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. పోతవరప్పాడు గ్రామానికి చెందిన సుమారు 15 మంది యువకులు మద్యం మత్తులో ఎస్ఎస్ రెస్టారెంట్‌పై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో యజమానితో పాటు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలోని ఆగిరిపల్లిలో బిర్యానీ ధరలో రూ.10 తగ్గడంపై తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. పోతవరప్పాడు గ్రామానికి చెందిన సుమారు 15 మంది యువకులు మద్యం మత్తులో ఆగిరిపల్లిలోని ఎస్ఎస్ రెస్టారెంట్‌పై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో రెస్టారెంట్ యజమాని తుల్లిమెళ్ళ శ్రీనివాసరావు, ఆయన కుమారుడు రాజేష్‌తో పాటు ఒడిశాకు చెందిన ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారికి చికిత్స
గాయపడిన ముగ్గురిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం, బిర్యానీ ధరలో రూ.10 తగ్గడంతో ఆ మొత్తాన్ని చెల్లించాలని కోరినందుకు యువకులతో వాగ్వాదం జరిగినట్లు తెలిపారు. అనంతరం యువకులు తిరిగి వచ్చి కర్రలు, రాళ్లు, బీరు సీసాలతో దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
సీసీ ఫుటేజీ లభ్యం
ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ పోలీసులకు లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.












