ఉత్తరప్రదేశ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 10
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రవాణా శాఖ అధికారి లలిత్ కుమార్ ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించగా, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రూ. 80 వేల జీతం పొందుతున్న అధికారి ఆస్తులు రూ. 300 కోట్లకు పైనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతని ఇంట్లో గోడలు, సోఫాలు, సీలింగ్లలో భారీగా డబ్బు, బంగారం దాచిపెట్టినట్లు తేలింది.
ప్రభుత్వ ఉద్యోగి, రవాణా శాఖలో పనిచేస్తున్న లలిత్ కుమార్ అనే అధికారి అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నెల జీతం రూ. 80 వేలు మాత్రమే అయినప్పటికీ, అతని ఆస్తులు రూ. 300 కోట్లకు పైనే ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏసీబీ దాడుల్లో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
లలిత్ కుమార్ తన ఇంటిని డబ్బు, బంగారం దాచుకోవడానికి ఒక అజ్ఞాత కోటలా మార్చేశాడు. ప్లాస్టిక్ డబ్బాల్లో డబ్బు కట్టలు పెట్టి, వాటిని గోడల మధ్యలో దాచి, పైనుంచి ప్లాస్టింగ్ చేయించాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఈ పని చేశాడు. ఇంట్లోని సోఫాలను కూడా ప్రత్యేకంగా తయారు చేయించి, వాటి మధ్యలో ఐరన్ పెట్టెలు పెట్టి, అందులో డబ్బు కట్టలను దాచిపెట్టాడు. ప్రతి గదిలో ఫాల్ సీలింగ్ చేయించి, ఆ సీలింగ్ పైన ప్లాస్టింగ్ కవర్లలో డబ్బు కట్టలను నింపి ఉంచాడు. దేవుడి బొమ్మల వెనుక బంగారం బిస్కెట్లను కూడా దాచినట్లు సమాచారం.












