బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
బోథ్ పట్టణంలో ఇంటి తాళం పగులగొట్టి సుమారు రూ.5,000 నగదును దొంగిలించిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నేరడిగొండ మండలం వాగ్దారికి చెందిన కృష్ణకాంత్ జాధవ్ (25)ను అదుపులోకి తీసుకున్నారు.
ఇంటి తాళం పగులగొట్టి రూ.5,000 నగదు చోరీ చేసిన నిందితుడిని బోథ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బోథ్ ఎస్ఐ వి. పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 24న బోథ్ పట్టణంలోని న్యూ కాలనీకి చెందిన ఓ మహిళ ఇంటికి తాళం వేసి పనికి వెళ్లింది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించింది. మరుసటి రోజు ఇంట్లోని పెట్టెలో దాచిన రూ.5,000 నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 26న అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరడిగొండ మండలం వాగ్దారికి చెందిన, ప్రస్తుతం బోథ్‌లో నివసిస్తున్న కృష్ణకాంత్ జాధవ్ (25) చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. కూలీ పనితో వచ్చే ఆదాయం సరిపోక తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇంటి తాళం పగులగొట్టి నగదు చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు ఎస్ఐ తెలిపారు. అతడి వద్ద నుంచి చోరీకి గురైన రూ.5,000 నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
ప్రజలు ఇళ్లకు బలమైన తాళాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ వి. పురుషోత్తం సూచించారు.












