అయోధ్య రామ మందిరానికి అందిన విరాళాల చోరీ, నిధుల దుర్వినియోగంపై దాఖలైన కీలక పిటిషన్లను ఈనెల 13వ తేదీ (సోమవారం)న సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. అత్యవసర కేసుల జాబితాలో ఈ పిటిషన్లను చేర్చారు.
అయోధ్య రామ మందిరానికి అందిన విరాళాల చోరీ, నిధుల దుర్వినియోగంపై దాఖలైన కీలక పిటిషన్లను ఈనెల 13వ తేదీ (సోమవారం)న సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ మోహన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణను చేపట్టబోతోంది.
సోమవారం ఉదయం న్యాయస్థానం కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే విచారించాల్సిన అత్యవసర కేసుల జాబితాలో (కాజ్ లిస్ట్) ఈ పిటిషన్లను చేర్చారు.
కోట్లాది మంది భక్తులు సమర్పించిన విరాళాల రక్షణ, పారదర్శకతకు సంబంధించిన అంశం కావడంతో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందిన విరాళాల చోరీకి సంబంధించి, కేవలం స్థానిక పోలీసు దర్యాప్తు మాత్రమే సరిపోదని పిటిషనర్లు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు.











