మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 10
అయోధ్య రామ మందిరం విరాళాల చోరీకి సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీ, సోమవారం విచారించనుంది. ఈ కేసులో సీబీఐ విచారణ, ట్రస్టు ఆర్థిక వ్యవహారాలపై ఆడిట్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను CJI సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.
అయోధ్య రామ మందిరం విరాళాల చోరీకి సంబంధించిన పిటిషన్లను ఈ నెల 13వ తేదీ, సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. చోరీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరపాలని, అలాగే రామ మందిర ట్రస్టు ఆర్థిక వ్యవహారాలపై స్వతంత్ర సంస్థలతో ఆడిట్ నిర్వహించాలని కోరుతూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. సోమవారం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన అనంతరం విచారణ చేపట్టే జాబితాలో ఈ కేసులను చేర్చారు. ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది.












