బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 02
ఆగస్టు 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో సన్నాహక సమావేశం జరిగింది. పట్నాపూర్ రాయి సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో ఆదివాసీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
ఆగస్టు 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పట్నాపూర్ రాయి సెంటర్లో సర్మేడి ఆడేం భీంరావ్ అధ్యక్షతన ఆదివాసీ గ్రామాల పటేల్ లు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, సర్పంచ్లు, వివిధ గ్రామాల ప్రజలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఆదివాసులందరూ పండుగలా జరుపుకోవాలి
ఈ సందర్భంగా న్యాయవాది పంద్రం శంకర్ మాట్లాడుతూ, బోథ్ మండల కేంద్రంలోని కొమురం భీమ్ విగ్రహం వద్ద జరుపుకునే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసులందరూ ఒక పండుగలాగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసుల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను నిర్వహించాలని ఆయన సూచించారు.
అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపు
మండలంలోని ఆదివాసీ గ్రామాల పటేల్ లు అధిక సంఖ్యలో ప్రజలను తీసుకుని వచ్చే బాధ్యత తీసుకోవాలని, తద్వారా అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని ఆయన కోరారు. ఉద్యోగ సంఘాల బాధ్యులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, యువజన సంఘాల నాయకులు, యువకులు, మహిళా సంఘ నాయకురాళ్లు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి, ఆగస్టు 9న జరుపుకోనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో లింగాపూర్ సర్మేడి నైతం కృష్ణ, కనక అమృత్ రావు, కరత్వాడ సర్పంచ్ దుర్వ విశ్వశ్వర్ రావు, నాగపూర్ సర్పంచ్ మాడవి దేవరావు, పిప్పల్దారి సర్పంచ్ కృష్ణ, పట్నాపూర్ మాజీ సర్పంచ్ తొడసం గోపాల్, మంగ్రపు మహేష్, పటేల్ ఆడేం పొల్లన్న, అందుర్ పటేల్ తో పాటు వివిధ గ్రామాల పటేల్లు, ప్రజలు పాల్గొన్నారు.












