రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండలం, విలాసాగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా నిర్మించిన నూతన గృహానికి ఘనంగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా గ్రామానికి చెందిన సుంకపాక లక్ష్మి-రాజయ్య కుటుంబం తమ సొంత ఇంటిని పొందారు. ఈ సందర్భంగా ఇంటి ప్రారంభోత్సవాన్ని రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు.
ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, ఉపసర్పంచ్ పొత్తూరి శైలజ-రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగుల ప్రశాంత్ కుమార్, మార్కెట్ డైరెక్టర్ కళ్లేపెల్లి సతీష్, సాగరం కనకయ్య, వార్డ్ సభ్యులు దమ్మ వెంకట రమణ, జోగు శంకర్, దయ్యాల రేణుక, పైండ్ల అనిల్, సుంకపాక హేమలత అనిల్ తదితరులు నిర్వహించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి కృషిని స్మరించుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తమకు సొంత ఇల్లు కలగడానికి ఎమ్మెల్యే అందించిన సహకారం మరువలేనిదని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి జనగం శేఖర్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










