మంథని, జులై 31
ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు సహోదరి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుల మేనత్త సువర్ణ వనమాల ఇటీవల మరణించారు. ఆమె దశ-దిన కర్మ కార్యక్రమం శుక్రవారం మంథనిలో జరిగింది.
ఉమ్మడి రాష్ట్ర మాజీ శాసనసభ స్పీకర్, దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు సహోదరి, తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుల మేనత్త అయిన సువర్ణ వనమాల ఇటీవల మరణించారు. ఆమె దశ-దిన కర్మ కార్యక్రమం శుక్రవారం మంథనిలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుతో కలిసి మంథని మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహావాది సతీష్ కుమార్, ముఖ్య సలహాదారులు మేడగోని రాజమౌళి గౌడ్, కార్యవర్గ సభ్యుడు మాదేశి శ్రావణ్ కుమార్, తదితరులు హాజరయ్యారు.
అనంతరం సువర్ణ వనమాల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు. వనమాల ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు.












