ఖానాపూర్, 2026-08-11
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని స్మశానవాటికకు మూడేళ్లుగా విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులకు తెరపడనుంది. సర్పంచ్ బక్కశెట్టి వెంకటరాములు చొరవతో మంగళవారం స్మశానవాటిక వరకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో స్మశానవాటిక నిర్మాణం చేపట్టారు. అయితే, నిధుల కొరతతో పనులు అరకొరగా నిలిచిపోయాయి.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని స్మశానవాటికకు మూడేళ్లుగా విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులకు తెరపడనుంది. సర్పంచ్ బక్కశెట్టి వెంకటరాములు చొరవతో మంగళవారం స్మశానవాటిక వరకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామపంచాయతీకి స్మశానవాటికల నిర్మాణంలో భాగంగా సుర్జాపూర్ లోనూ స్మశానవాటికను నిర్మించారు. అయితే, నిధుల కొరతతో పనులు అరకొరగా నిలిచిపోయాయి.
విద్యుత్ లేక బోరు నీరు వృధా
స్మశానవాటికలో బోరు సౌకర్యం ఉన్నప్పటికీ, విద్యుత్ లేకపోవడంతో నీటిని వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. దీంతో పాటు రాత్రివేళల్లో వెలుతురు లేకపోవడంతో అంత్యక్రియలకు హాజరయ్యే బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గ్రామస్తులు పలుమార్లు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు.
సర్పంచ్ చొరవతో పనులు ప్రారంభం
గ్రామస్తుల సమస్యలను సానుకూలంగా స్వీకరించిన సర్పంచ్ బక్కశెట్టి వెంకటరాములు, స్మశానవాటికకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మంగళవారం గ్రామం నుంచి స్మశానవాటిక వరకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులను ఆయన స్వయంగా ప్రారంభించారు. త్వరలోనే విద్యుత్ కనెక్షన్ అందించి, బోరు ద్వారా నీటి సౌకర్యంతో పాటు రాత్రివేళల్లో వెలుతురు కోసం దీపాల ఏర్పాటు చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.
గ్రామస్తుల హర్షం
మూడేళ్లుగా పరిష్కారం కాని తమ సమస్యకు సర్పంచ్ చొరవతో పరిష్కారం లభిస్తుండటంతో సుర్జాపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కడమంచి లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి విక్రమ్ రాజ్, వార్డు సభ్యులు రాకేష్, గంగన్న, రాజన్న, రమేష్, రాజు, నాయకులు ఆకుల వెంక గౌడ్, జంగిలి శంకర్, బూసి నరేందర్, విద్యుత్ లైన్మెన్ నరేష్, కారోబార్ ప్రసన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.










