మస్కాపూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
ప్రముఖ సినీ నటుడు, సమాజ సేవకుడు సోనూ సూద్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు వినూత్నంగా స్పందించాడు. తన ఇస్త్రీ దుకాణానికి "సోనూ సూద్ లాండ్రి షాప్" అని పేరు పెట్టుకోవడమే కాకుండా, ప్రతి ఏడాది సోనూ సూద్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకుంటున్నాడు.
సేవకు మారుపేరుగా నిలిచిన ప్రముఖ సినీ నటుడు, సమాజ సేవకుడు సోనూ సూద్ గారి పట్ల తనకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకుంటున్నాడు ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్. తన ఇస్త్రీ దుకాణానికి "సోనూ సూద్ లాండ్రి షాప్" అని పేరు పెట్టుకోవడమే కాకుండా, ప్రతి ఏడాది సోనూ సూద్ గారి జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకుంటున్నాడు.
ఈ సందర్భంగా మస్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వస్తువులను పంపిణీ చేసి, 'సేవే నిజమైన పండుగ' అనే సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొని వెంకటేష్‌ను అభినందించారు. అలాగే, సోనూ సూద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అభిమానం అంటే కేవలం ఫోటోలు పెట్టడం కాదని, వారి సేవా స్ఫూర్తిని ఆచరించడమే నిజమైన అభిమానం అని వెంకటేష్ నిరూపించుకున్నాడు. మీ సేవా స్ఫూర్తి మరెందరికో ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, 'హ్యాపీ బర్త్‌డే సోనూ సూద్ గారు!' అని శుభాకాంక్షలు తెలిపారు.












