నిజామాబాద్, జూలై 31
నిజామాబాద్ నగరంలో డిపో–1 మేనేజర్ సంపూర్ణానంద్ పదవీ విరమణ సందర్భంగా శివాజీ నగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆయన దంపతులను ఘనంగా సన్మానించారు. లక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో డిపో–1 మేనేజర్ సంపూర్ణానంద్ పదవీ విరమణ సందర్భంగా శివాజీ నగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆయన దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన దంపతులకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సంపూర్ణానంద్ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో సేవలందించడం ఒక ఆనందమైతే, పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయులు, మిత్రులు తనను ఘనంగా సన్మానించడం మరింత ఆనందాన్ని కలిగించిందని అన్నారు. పదవీ విరమణ జరిగినట్లు ఇప్పటికీ అనిపించడం లేదని, శివాజీ నగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు చూపిన ప్రేమ, ఆప్యాయత తనలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని పేర్కొన్నారు.
తనకు ఆప్యాయంగా వీడ్కోలు పలికి సన్మానించిన శివాజీ నగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శివాజీ నగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు పాల్గొని సంపూర్ణానంద్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.












