పండుగ సాయన్న జయంతి ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి :
మిర్యాలగూడ ఆగస్టు 8 (మనోరంజని తెలుగు టైమ్స్)
బహుజన వీరుడు పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్ కోరారు శనివారం మిర్యాలగూడ బీసీ భవన్ లో పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని బీసీ సంఘాల ఆధ్వర్యం లో నిర్వహించినకార్యక్రమం లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులుఅర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన బహుజన వీరుడు పండుగ సాయన్న అని అన్నారు. పండుగ సాయన్న కేవలం భౌతిక దోపిడీకి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, సామాజిక న్యాయం కోసం, రాజ్యాధికారంలో బీసీలకు న్యాయమైన వాటా కోసం పోరాటం సాగించినట్లుతెలిపారు.సాయన్న వారసత్వాన్ని కేవలం జయంతి నాడు గౌరవించడంలో కాదు ఆయన కలలను నిజం చేసే దిశగా బీసీలు, బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులువేయాలన్నారు. బీసీలు తమ సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం సంఘటితమవాలని, రాజకీయ తలంపుల కోసం కాకుండా, సామాజిక న్యాయ సాధన కోసం పండుగ సాయన్న జయంతిని గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకోవాలనీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈనెల 9న నల్లగొండ లో జరిగే సామాజిక న్యాయ పోరాట సభను విజయవంతం చేయాలనికోరారు.ఈకార్యక్రమంలో బీసీ జేఏసీ కో కన్వీనర్లు చేగొండి మురళియాదవ్,దాసరాజు జయరాజు, చిరంజీవి, పున్న రాములు, పిల్లల మర్రి రవి,తదితరులు పాల్గొన్నారు.










