బాసర, 2026-06-05
బాసర మండలం ఓని గ్రామపంచాయతీలో 202627 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వీబీజీరామ్‌జీ పథకం కింద చేపట్టనున్న అభివృద్ధి పనులపై సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ పథకంలో భాగంగా చేపట్టనున్న 318 పనులపై గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించారు.
బాసర మండలం ఓని గ్రామపంచాయతీలో 202627 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వీబీజీరామ్‌జీ పథకం కింద చేపట్టనున్న అభివృద్ధి పనులపై సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ పథకంలో భాగంగా చేపట్టనున్న 318 పనులపై గ్రామస్తులకు, ఉపాధి కూలీలకు, గ్రామ ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో ప్రణాళిక రూపొందించడంపై చర్చించారు.
గ్రామసభకు సర్పంచ్ జాదవ్ జగదీష్ అధ్యక్షత వహించారు. ఉపసర్పంచ్ పి. పురుషోత్తం, ఏపీవో సదానందచారి, టెక్నికల్ అసిస్టెంట్ రావుల రాజు, పంచాయతీ కార్యదర్శి మధుకర్‌రావు, ఫీల్డ్ అసిస్టెంట్ సూర్యవంశి రాములు, వీడీసీ సభ్యులు జాదవ్ గంగాధర్, మాజీ సర్పంచ్ సురేష్, వార్డు సభ్యులు, ఉపాధి కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వీబీజీరామ్‌జీ పథకం ద్వారా గ్రామంలో చేపట్టనున్న 318 పనులు, వాటి ప్రాధాన్యత, గ్రామాభివృద్ధికి కలిగే ప్రయోజనాలు, కూలీలకు లభించే ఉపాధి అవకాశాలపై అధికారులు వివరించారు. గ్రామసభలో ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని పనుల ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని సర్పంచ్ జాదవ్ జగదీష్ పేర్కొన్నారు.

