నిర్మల్, 2026-06-05
న్యాయ సేవా ప్రజా చైతన్య సమితి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండల కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సొక్కల బాపయ్య జాతీయ జెండాను ఎగురవేశారు.
న్యాయ సేవా ప్రజా చైతన్య సమితి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండల కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సొక్కల బాపయ్య జాతీయ జెండాను ఎగురవేశారు.
స్వాతంత్ర్యం గురించి ప్రసంగిస్తూ, 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన రోజును గుర్తు చేసుకోవడం, జాతీయ జెండాకు గౌరవం అర్పించడం వంటి అంశాలను వివరించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం ద్వారా భారత రాజ్యాంగం, దేశ ఐక్యత, సార్వభౌమత్వం, దేశ గౌరవానికి మనం గౌరవం తెలియజేస్తామని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రజలకు గుర్తు చేయడం, దేశ ఐక్యతను చాటడం, కులం, మతం, ప్రాంతం, భాష అనే తేడాలు లేకుండా మనమంతా భారతీయులం అనే భావనను బలపరచడం, యువతలో దేశభక్తిని పెంపొందించడం, దేశం పట్ల బాధ్యత, క్రమశిక్షణ, రాజ్యాంగ విలువలు, సమాజ సేవ వంటి భావాలను యువతలో తెలిపే విధానం గురించి ప్రస్తావించారు. ఆగస్టు 15న జెండా ఎగురవేయడం అంటే స్వాతంత్ర్యం, త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ జెండాకు గౌరవం అర్పించి, దేశ ఐక్యత మరియు అభివృద్ధి కోసం మన బాధ్యతను గుర్తు చేసుకోవడమేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు, లక్ష్మణ్ చందా మండల అధ్యక్షుడు వేముల రాజు, మండల ఉపాధ్యక్షుడు సురేష్, నిర్మల్ నియోజకవర్గ అధ్యక్షులు గంగాధర సురేష్, డివిజన్ అధ్యక్షులు రంజిత్, గ్రామ అధ్యక్షులు ఓస రాజేశ్వర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ, మండల సమితి సభ్యులు, ప్రజలు, పాఠశాల పిల్లలు, అధికారులు, నాయకులు ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












