భైంసా, జూలై 31
బైంసా పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికులకు కిట్ డ్రెస్సులు, గ్లౌజులను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పంపిణీ చేశారు. శుక్రవారం భైంసా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తుతో కలిసి కార్మికులకు రక్షణ సామగ్రిని అందజేశారు.
బైంసా పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికులకు కిట్ డ్రెస్సులు, గ్లౌజులను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పంపిణీ చేశారు. శుక్రవారం భైంసా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తుతో కలిసి కార్మికులకు రక్షణ సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతతో పాటు ప్రజారోగ్య పరిరక్షణలో మున్సిపల్ కార్మికుల సేవలు ఎంతో విలువైనవని అన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు వారు అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.












