తానూర్, 2026-09-01
తానూర్ మండలంలోని ఎల్వి, కోలూరు, తొండాల గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఈ క్లిష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాల పరిస్థితులను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు.
ఎమ్మెల్యే పరామర్శ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.