స్థానిక భైంసా పట్టణానికి చెందిన జాదవ్ సావిత్రి బాయి గారి భర్త బాబురావు ఇటీవల మరణించడంతో, మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ ఆ కుటుంబానికి అండగా నిలిచి, నిత్య అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు.
జాదవ్ సావిత్రి బాయి గారి భర్త బాబురావు ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉంది. ఈ విషయం తెలుసుకున్న మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్, ఆ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. తక్షణ అవసరాల కోసం ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మోహన్ రావు పటిల్ మాట్లాడుతూ, "తాము నిర్వహించిన 'పల్లె పల్లెకు బీజేపీ, గడప గడపకు మోహన్ రావు పటేల్' కార్యక్రమం విజయవంతం చేయడంలో జాదవ్ సావిత్రి బాయి గారి కుమారుడు గణేష్ గారి కృషి ఎంతో ఉందని" పేర్కొన్నారు. గణేష్ గారి కుటుంబానికి ఈ కష్టకాలంలో అండగా ఉండటం తమ బాధ్యత అని తెలిపారు.
అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, తమ ప్రజా ట్రస్ట్ పేద, మధ్య తరగతి కుటుంబాలకు సహాయం అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సహాయం ఆ కుటుంబానికి కొంతమేరకైనా ఉపశమనం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్, సామాజిక బాధ్యతగా ఇలాంటి సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తూ, సమాజానికి సేవ చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు.











