మిర్యాలగూడ పట్టణంలోని బీసీ భవనంలో శుక్రవారం దొడ్డి కొమరయ్య జయంతిని పురస్కరించుకొని యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు బీసీ సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు.
యాదవ సంఘం మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు చిమట ఎర్రయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి చేగొండి మురళీ యాదవ్, గౌరవ సలహా దారు కంపసాటి మధుసూదన్ యాదవ్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులర్పించారు.
ముఖ్య అతిథులుగా హాజరైన బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్, కో కన్వీనర్ దాసరాజు జయరాజు, గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్, సామాజిక వేత్త డాక్టర్ రాజు, బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరధ నాయక్, ఉపాధ్యాయుల బీసీ సంఘం జిల్లా నాయకులు రాపోలు పరమేష్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు.
ఈ జయంతి కార్యక్రమానికి పిల్లలమర్రి రవికుమార్, పున్న రాములు, రావిరాల ప్రకాష్, రవీందర్ గౌడ్, ఫరూక్ వంటి ప్రముఖులు కూడా హాజరై, దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని స్మరించుకున్నారు. సంఘం నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












