ప్రొద్దుటూరు, 2024-08-15
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు.
బ్యాడ్జీల పంపిణీ, అవగాహన కార్యక్రమం
ఈ సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు జాతీయ జెండా రంగులతో కూడిన బ్యాడ్జీలను పంపిణీ చేశారు. దేశభక్తి, జాతీయ ఐక్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో తమ వంతు బాధ్యతగా సేవ చేయాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాసేవ, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఫౌండేషన్ సభ్యులు కోరారు.
యువతకు పిలుపు
యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములై సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, సేవాభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.












