సామాజిక సేవకులు, వ్యాపారవేత్త అయిన మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్) 75వ జన్మదిన వేడుకలు ఆదివారం మిర్యాలగూడలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర హోటల్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు, డైమండ్ బేకరీ స్వీట్ హౌస్ అధినేత, డైమండ్ నేత్ర నిధి వ్యవస్థాపకులు మాశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన తన సతీమణి మాశెట్టి గీతతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన అతిథులకు, శ్రేయోభిలాషులకు స్వీట్లు పంచిపెట్టారు.
ఈ జన్మదిన వేడుకలకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు, డైమండ్ నేత్ర నిధి సభ్యులు, పలువురు సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు.
వచ్చిన ప్రతి ఒక్కరూ మాశెట్టి శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.











