తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ పరశురామ జయంతి వేడుకల సందర్భంగా స్థానిక విద్యా ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష నిపుణుడు మానికొండ రాజశేఖర్ శర్మ గారికి ప్రతిష్టాత్మకమైన “శ్రీ పరశురామ పురస్కారం” ను ప్రకటించారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026కు గాను ఈ పురస్కారం మానికొండ రాజశేఖర్ శర్మ గారికి దక్కింది.
బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఈ పురస్కారాన్ని అందజేసింది.
ఈ సందర్భంగా మానికొండ రాజశేఖర్ శర్మ మాట్లాడుతూ, ఈ పురస్కారాన్ని ప్రకటించినందుకు సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ గారికి, వారి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పురస్కారం తనకు మరింత సేవ చేయడానికి ప్రేరణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.








