ఆలూరు, 2026-06-05
మాలల హక్కుల పరిరక్షణకు అందరూ ఏకమవ్వాలని మాల కోఆర్డినేషన్ ఫోరం పిలుపునిచ్చింది. ఆలూరు మండల కేంద్రంలో బుధవారం మాల మహానాడు మండల అధ్యక్షుడు అగ్గు క్రాంతి ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేశారు. 2014లో 23 లక్షలుగా ఉన్న మాలల జనాభాను ప్రస్తుతం 15 లక్షలుగా చూపించి మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణచివేసే కుట్ర జరుగుతోందని నాయకులు ఆరోపించారు.

రోస్టర్ పాయింట్ల సవరణ డిమాండ్
రోస్టర్ పాయింట్ విధానాన్ని వెంటనే సవరించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మాలలు సంఘటితమై ప్రభుత్వాన్ని నిలదీస్తారని హెచ్చరించారు.
విస్తృత స్థాయి సమావేశం
రోస్టర్ పాయింట్ల వల్ల జరుగుతున్న నష్టాలను, భవిష్యత్ కార్యాచరణను వివరించేందుకు ఈ నెల 23న ఆర్మూర్ వేదికగా మాల కోఆర్డినేషన్ ఫోరం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి నిజామాబాద్ జిల్లాలోని మాల సోదరులు, ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో హరీష్, భాస్కర్, ప్రదీప్, వెంకటేష్, రానదీర్, సురేష్, రజనీకాంత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.