(బి) (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
సారంగాపూర్ మండలంలోని కౌట్ల (బి) గ్రామంలో శనివారం మహిళలు, బాలల రక్షణపై గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ బల్గురి అజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల విద్యాధికారి ముఖ్య అతిథిగా హాజరై బాలల హక్కులు, భద్రతపై అవగాహన కల్పించారు.
సారంగాపూర్ మండలంలోని కౌట్ల (బి) గ్రామంలో శనివారం సర్పంచ్ బల్గురి అజయ్ అధ్యక్షతన మహిళలు, బాలల రక్షణపై గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి మండల విద్యాధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మహిళలు, బాలల భద్రత, హక్కుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోక్సో చట్టం–2012, బాలల హక్కులు, చైల్డ్ సేఫ్టీ, సేఫ్ టచ్–అన్‌సేఫ్ టచ్, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, ఫిర్యాదు చేసే విధానం, చట్టంలోని కీలక నిబంధనలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించారు.
భ్రూణహత్యలు చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడరాదని సూచించారు. వర్షాకాలంలో కలుషిత నీటి కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇప్ప శ్రీకాంత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఈసరి శివ, ఫీల్డ్ అసిస్టెంట్ నారాయణ, కారోబారి నరసయ్య, ఉపాధ్యాయుడు గణేశ్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఇంద్రమ్మ లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.












