మాక్లూరు మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన రమ కుమారుడి వివాహం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ ఎన్ పంక్షన్ హాల్లో జరిగిన ఈ వివాహ మహోత్సవంలో వధువు-వరుల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు.
మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావుతో పాటు డి. నర్సింగ్ రావు, మాజీ సర్పంచ్ బిలోలి, దాదాన్నగారి వెంకటేశ్వర్ రావు వంటి పలువురు ముఖ్యులు ఈ వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకల్లో కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. కుటుంబ సభ్యులందరూ ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు.


