లొకేశ్వరం (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 31
లొకేశ్వరం మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు ఆన్లైన్ (డిజిటల్) రశీదులు ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కేవలం మాన్యువల్ స్టాంపులు వేసి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లొకేశ్వరం మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు ఆన్లైన్ (డిజిటల్) రశీదులు ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజావాణిలో సమర్పించే దరఖాస్తులకు అధికారులు డిజిటల్ రశీదులు ఇవ్వకుండా కేవలం మాన్యువల్ స్టాంపులు వేసి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల పిప్రి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌గౌడ్ ఇచ్చిన వినతిపత్రానికి కూడా అధికారులు డిజిటల్ రశీదు ఇవ్వలేదు. దీనివల్ల తమ ఫిర్యాదు ఏ దశలో ఉందో, పరిష్కారం అయ్యిందో లేదో ఆన్లైన్లో తెలుసుకోవడానికి వీలులేకుండా పోతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి విచారణ జరపకుండానే దరఖాస్తులను పోర్టల్‌లో క్లోజ్ చేస్తున్నారని, లాగిన్ అకౌంటబిలిటీ లాగ్ రిపోర్ట్ ( ) పారదర్శకంగా అందించాలని కోరుతున్నారు.
ప్రజావాణిలో సమర్పించే దరఖాస్తులకు డిజిటల్ రశీదులు ఇవ్వడం ద్వారా ఫిర్యాదుల పురోగతిని తెలుసుకోవడం సులభతరం అవుతుంది. ప్రస్తుతం మాన్యువల్ విధానం వల్ల పారదర్శకత లోపిస్తోందని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
వెంటనే ఉన్నతాధికారులు స్పందించి, ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తుకు విధిగా ఆన్లైన్ రశీదు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.












