ఖానాపూర్, 2026-08-05
ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు యువ నాయకులు చిట్యాల ఠాగూర్ ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ కేంద్రాన్ని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ప్రారంభించారు.
ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని యువ నాయకులు చిట్యాల ఠాగూర్ ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ కేంద్రాన్ని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వాటర్ ఫిల్టర్ కేంద్రాన్ని పరిశీలించిన భూక్యా జాన్సన్ నాయక్, పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి, వారి దైనందిన అవసరాలకు ఉపయోగపడే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చిట్యాల ఠాగూర్ గారిని, వారి కుటుంబ సభ్యులను భూక్యా జాన్సన్ నాయక్ అభినందించి, ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వాటర్ ఫిల్టర్ కేంద్రాన్ని కాలనీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.












