ఖానాపూర్ మండల ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా డీపీఆర్ స్టూడియోకు చెందిన గోపి రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.
అధ్యక్షుడిగా ఎన్నికైన గోపి మాట్లాడుతూ, తనపై సభ్యులు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తూ, ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల సంక్షేమం కోసం అందరినీ సమన్వయం చేసుకుని పనిచేస్తానని అన్నారు.
ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ, గోపి రాజశేఖర్ నాయకత్వంలో అసోసియేషన్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, ఫోటో మరియు వీడియోగ్రాఫర్లు పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.










