ఖానాపూర్, 2026-08-05
ఖానాపూర్ పట్టణంలోని 7వ వార్డులో శుక్రవారం కోతులను పట్టించే కార్యక్రమం చేపట్టారు. గత కొంతకాలంగా పట్టణంలో కోతుల బెడద వలన ఒకరు మరణించగా, చాలామంది గాయాల పాలైన సంఘటనలు కలవు.
ఖానాపూర్ పట్టణంలోని 7వ వార్డులో శుక్రవారం కోతులను పట్టించినట్టు కౌన్సిలర్ నిమ్మల రమేష్ తెలిపారు. గత కొంతకాలంగా పట్టణంలో కోతుల బెడద వలన ఒకరు మరణించగా, చాలామంది వృద్ధులు, యువకులు, పిల్లలు గాయాల పాలైన సంఘటనలు అనేకం కలవు.
గత పాలకవర్గం వైఫల్యం
గత పాలకవర్గం కూడా కోతులను పట్టించినప్పటికిని మళ్లీ వాటి సంఖ్య పెరిగిపోయింది. దీంతో ప్రతిచోట, ప్రతి గల్లీ కోతులతో నిండిపోయింది.
నూతన పాలకవర్గం చర్యలు
నూతనంగా ఏర్పడిన పాలకవర్గం మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక, మహేందర్ లు సమావేశాల్లో కోతుల గూర్చి, వాటిని పట్టించుట గూర్చి తీర్మానించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం 7వ వార్డులో కోతులను పట్టించే కార్యక్రమం చేపట్టారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షోయబ్ హుస్సేన్, బిజెపి నాయకులు అంకం మహేందర్, కౌన్సిలర్ నిమ్మల రమేష్, ఆత్మ చైర్మన్ తోట సత్యం, జమాల్, కాంగ్రెస్ నాయకులు గొర్రె గంగాధర్, రాము, లక్ష్మణ్, రామ్ భీమన్న, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












