నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నందిగామ గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘం అధ్యక్షులు చేట్టికింది నారాయణరావు (68) అనారోగ్యంతో బాధపడుతూ జూలై 31న కన్నుమూశారు.
కుటుంబ సభ్యుల దిగ్భ్రాంతి
ఆయన మృతిపట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతునికి భార్య శోభ, కుమారులు సదాశివ్ రావు, సుధాకర్ రావు సునీల్ రావు ఉన్నారు.
పరామర్శించిన ప్రముఖులు
మృతుని కుటుంబ సభ్యులను ఆయన తమ్ముడు, రిటైర్డ్ ఏఎస్సై జీవన్ రావు, నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు , రిటైర్డ్ ఎస్సై కొసల్లి నాగారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబ సభ్యులకు వారు ధైర్యం చెప్పారు.










