డొంకేశ్వర్ తహసీల్దార్ కార్యాలయంలో సబార్డినేట్ (అటెండర్)గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన రామిల్లి భూమన్నకు శుక్రవారం ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డొంకేశ్వర్ తహసీల్దార్ జి. ప్రసాద్, నవీపేట్ తహసీల్దార్ వెంకటరమణ, విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ మహిపాల్ చారి, డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు గణేష్ గౌడ్, ఆర్ఐ నితీష్ రెడ్డితో పాటు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొని భూమన్నకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు.
వక్తలు మాట్లాడుతూ రామిల్లి భూమన్న తన ఉద్యోగ జీవితంలో క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావంతో విధులు నిర్వహించి అందరి అభినందనలు పొందారని కొనియాడారు. అనంతరం ఆయనకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆరోగ్యంగా సుఖసంతోషాలతో జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.










