సారంగాపూర్, 2024-06-05
సారంగాపూర్ మండలం కౌట్ల బి గ్రామానికి చెందిన కాసారం రాజేశ్వర్ అనే 100 శాతం అంధత్వంతో బాధపడుతున్న దివ్యాంగుడు తన ఉద్యోగ సమస్య పరిష్కారం కోసం గత 10 ఏళ్లుగా పోరాడుతున్నారు. 2015-16లో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకుని అర్హత సాధించినప్పటికీ, తనకు ఉద్యోగం కల్పించకుండా వేరొకరికి అప్పగించారని ఆయన ఆరోపిస్తున్నారు.

న్యాయం కోసం నిరీక్షణ
ఈ విషయమై రాజేశ్వర్ గత 10 ఏళ్లుగా గ్రీవెన్స్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా తన విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు. పూర్తిగా కళ్ళు కనబడకపోవడం, వృద్ధురాలైన తల్లి (88) పోషణ భారంగా మారడంతో పూట గడవడం కష్టంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజావాణిలో వినతి
న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల 17న నిర్వహించిన మొదటి ప్రజావాణి కార్యక్రమంలో కూడా ఉద్యోగం ఇప్పించాలని వినతి పత్రం ద్వారా ఎంపీడీవో లక్ష్మి కాంతారావుకు అందజేశారు.