ఖానాపూర్, 2026-08-15
ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం గ్రామ అధ్యక్షులు, జిల్లా ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు రాసమల్ల భాస్కర్ అంబేద్కర్ విగ్రహం ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

స్వాతంత్ర్య సమరయోధుల స్మరణ
ఈ వేడుకల సందర్భంగా స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన జాతీయ నాయకులను స్మరించుకున్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ప్రాణ త్యాగానికైనా వెనకాడకుండా ముందు నిలవాలని రాసమల్ల భాస్కర్ పిలుపునిచ్చారు.
దేశాభివృద్ధికి కృషి చేయాలి
దేశాన్ని మనము కాపాడుకొని అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు నాగరాజు, నభి ఖాన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.