మంచిర్యాల జిల్లా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 01
అంతర్జాతీయ పోస్టల్ ఉద్యోగుల దినోత్సవం సందర్భంగా చెన్నూరు పోస్ట్ మాస్టర్ అడువాల వెంకటస్వామిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ లయన్ జాడి తిరుపతి, ప్రెసిడెంట్ లయన్ నిమ్మల సాగర్ గారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకటస్వామి సేవలను కొనియాడారు.
అంతర్జాతీయ పోస్టల్ ఉద్యోగుల దినోత్సవం పురస్కరించుకొని చెన్నూరు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్‌లో ఉన్నత సేవలు అందిస్తున్న పోస్ట్ మాస్టర్ అడువాల వెంకటస్వామిని చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ లయన్ జాడి తిరుపతి, ప్రెసిడెంట్ లయన్ నిమ్మల సాగర్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజంలో సమాచార వ్యవస్థకు, ప్రభుత్వ సేవల చేరవేతకు పోస్టల్ రంగం ఎంతో కీలకమైనదని కొనియాడారు. సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందినా.. క్షేత్రస్థాయిలో ప్రజలకు నమ్మకమైన సేవలు అందించడంలో పోస్టల్ శాఖ పాత్ర అద్భుతమైనదన్నారు.
చెన్నూరు పోస్ట్ మాస్టర్‌గా అడువాల వెంకటస్వామి అందిస్తున్న ఉన్నతమైన సేవలను, వారి నిబద్ధతను గుర్తించి ఈ సన్మానం చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.
ఈ విలక్షణ సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ట్రెజరర్ లయన్ సౌడం శ్రీనివాస్, సెక్రటరీ లయన్ కప్స ప్రతాప్ సింగ్, లయన్ కట్ట సదానందం, లయన్ సౌడం సంతోష్, లయన్ బుద్ధారపు ప్రకాష్ బాబు, మరియు సంపత్ తదితరులు పాల్గొని పోస్ట్ మాస్టర్ వెంకటస్వామి ని దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.












