తానూర్ మండలంలోని బామ్ని గ్రామంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ సహకారంతో డ్రీమ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

పిల్లల భవిష్యత్తుపై డ్రీమ్స్ సంస్థ సూచనలు
ర్యాలీ అనంతరం డ్రీమ్స్ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, గ్రామంలోని పిల్లలను ఎవరూ పనిలో పెట్టుకోకూడదని, ప్రతి చిన్నారి పాఠశాలకు వెళ్లేలా చూడాలని సూచించారు. పిల్లల చేతుల్లో పనిముట్లు కాకుండా పలకా బలపం ఉండాలని, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుర్గంవార్ గణేష్, పంచాయతీ కార్యదర్శి ఎం. రవికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వినోద్, ఉపాధ్యాయురాలు గీత, అంగన్వాడీ కార్యకర్త గంగామణి, డ్రీమ్స్ సంస్థ మండల ప్రతినిధి కాస దత్తు, పోషకులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.