తానూర్, 2026-07-31
వివక్షను, పేదరికాన్ని ఎదుర్కొంటూ, ప్రాథమిక విద్య కూడా అందని పరిస్థితుల్లో సైతం కష్టపడి అక్షర జ్ఞానం సంపాదించి, సమాజానికి వెలుగుదారి చూపిన సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాఠె 106వ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం. 'అన్నా' అని అందరిచే పిలుపునందుకున్న ఆయన అసలు పేరు తుకారాం భావురావ్ సారె. మహారాష్ట్రలోని వాటేగావ్ గ్రామంలో 1920 ఆగస్టు 1న జన్మించారు. బాల్యంలోనే అభంగ్స్ పాడటం, 'తమాషా' ప్రదర్శనలు, యుద్ధ కళల్లో ప్రావీణ్యం సాధించారు. 10 ఏళ్లకే స్వాతంత్ర్య ఉద్యమంలోనూ పాల్గొన్నారు.
వివక్షను ఎదుర్కొంటూ ప్రాథమిక విద్యను అభ్యసించినా, ప్రాథమిక విద్య కూడా అందని పరిస్థితుల్లో సైతం కష్టపడి అక్షర జ్ఞానం సంపాదించి, సమాజానికి వెలుగుదారి చూపిన సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాఠె 106వ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం. 'అన్నా' అని అందరిచే పిలుపునందుకున్న ఆయన అసలు పేరు తుకారాం భావురావ్ సారె. మహారాష్ట్రలోని వాటేగావ్ గ్రామంలో 1920 ఆగస్టు 1న వాలుబాయి- భాపురావ్ సిద్దోజి సాఠే దంపతులకు జన్మించారు. బాల్యంలోనే అభంగ్స్ పాడటం, 'తమాషా' (నాటక, నృత్య, సంగీత ప్రదర్శన)లలో చురుగ్గా పాల్గొనడం, యుద్ధ కళల్లో ప్రావీణ్యం సాధించడం వంటివి చేశారు. 10 ఏళ్లకే స్వాతంత్ర్య ఉద్యమంలోనూ పాల్గొన్నారు.
1930లో తీవ్ర కరువు కారణంగా కుటుంబంతో కలిసి బొంబాయికి వలస వెళ్లిన అన్నా, పేదరికం కారణంగా 11 ఏళ్లకే తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా వివిధ పనులు చేశారు. ఒక సినిమా థియేటర్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేయడం ఆయన జీవితాన్ని మార్చేసింది. సినిమాలపై పెరిగిన వ్యామోహం, సమాజానికి హీరోలా ఉపయోగపడాలనే కోరికతో చదువుపై ఆసక్తి పెంచుకున్నారు. దుకాణాలు, హోటళ్లు, సినిమా పోస్టర్లపై ఉన్న అక్షరాలను చదువుతూ, కష్టపడి రాయడం, చదవడం నేర్చుకున్నారు. ఆయన కలం నుంచి వెలువడిన అనేక నవలలు, కథల ఆధారంగా పలు చలన చిత్రాలు నిర్మించబడ్డాయి. నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రైటర్, చిత్ర సమీక్షకుడిగా సినిమా రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా మహారాష్ట్ర ప్రభుత్వం అన్నాభావు సాఠే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తోంది.
బొంబాయిలో మిల్లు కార్మికుడిగా పనిచేస్తున్నప్పుడు కమ్యూనిజం భావాల వైపు ఆకర్షితులై, కార్మిక పోరాటాలకు ప్రాతినిథ్యం వహించారు. పార్టీకి అనుబంధంగా అనేక సంస్థల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. 'లోక్ యుద్ధ', 'లోక్ సాహిత్య', 'యుగాంతర్' వంటి మరాఠీ వార్తాపత్రికలలో విలేకరిగా పనిచేస్తూ, సామాన్యుల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, వ్యవస్థ లోపాలను బహిర్గతపర్చే రాతలతో ప్రజలచే నిజజీవిత హీరోగా ప్రశంసలు అందుకున్నారు. స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అన్నాభావు సాఠె తన జీవితకాలంలో 35 నవలలు, కథల సంకలనాలు, నాటకాలు, లావణి, పోవాడా వంటి దాదాపు 100కు పైగా రచనలు చేశారు. ఆయన రచనలు భారతీయ భాషలతో పాటు 27 ప్రపంచ భాషల్లోకి అనువాదం కావడంతో సాహిత్య సామ్రాట్ గా ప్రఖ్యాతి చెందారు. ప్రజలు ఆయనను 'లోక్ షాహిర్' (ప్రజా కవి) అని పిలిచేవారు. రష్యా విప్లవంపై రాసిన 'స్టాలిన్ గ్రాడ్' నాటకం రష్యన్ భాషలోకి అనువాదం కావడంతో అక్కడ కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. రష్యాలో రాజ్ కపూర్ తో పాటు అత్యధిక అభిమానులున్న భారతీయుడిగా అన్నా భావు సాఠెను గుర్తించి అప్పటి భారత ప్రధాని నెహ్రూ ఆశ్చర్యపోయారు. 1961లో రష్యాను సందర్శించి, ఆ అనుభవాలను 'మాజా రష్యా చా ప్రవాస్' గ్రంథస్థం చేసిన తొలి బహుజన వ్యక్తిగా చరిత్రకెక్కారు. రష్యాలో ఆయన పేరు మీదుగా స్కాలర్షిప్ ఇవ్వడం, 2022లో మాస్కోలో విగ్రహం ఆవిష్కరించడం ఆయన మహోన్నత ప్రతిభకు నిదర్శనం.











