తెలంగాణ మట్టి పరిమళాన్ని, పల్లెటూరి జీవన విధానాన్ని తన గాత్రంలో ప్రతిబింబిస్తూ, ఆలోచనాత్మక రచనలతో యువ రచయిత ఆకాష్ కేడేవార్ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.
కుంటాల మండలంలోని లింబా (కే) గ్రామానికి చెందిన ఆకాష్ కేడేవార్, తన జానపద గీతాల ద్వారా ప్రజాదరణ పొందుతున్నారు. ఆయన ఆలపించిన 'దూరమై పోయావే', 'దొరసాని', 'ఓలమ్మో పెళ్లి' వంటి పాటలు విశేష ఆదరణ పొందాయి.
గాయకుడిగానే కాకుండా, రచయితగా కూడా ఆకాష్ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయన రచించిన 'నాన్న.. ఒక నిశ్శబ్ద సముద్రం' పుస్తకం పాఠకులను ఆలోచింపజేసేలా ఉందని ప్రశంసలు అందుకుంటోంది.
ఈ పుస్తకం రాష్ట్రంలోని పలువురు ప్రముఖుల నుంచి అభినందనలు అందుకుంది. పాఠకులకు విస్తృతంగా చేరువ కావడంతో మంచి ఆదరణ పొందుతోంది. తనకు లభిస్తున్న ప్రోత్సాహానికి గ్రామ ప్రజల ఆదరాభిమానాలే ప్రధాన కారణమని ఆకాష్ తెలిపారు.
భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మరిన్ని మంచి రచనలు, జానపద గీతాలను అందిస్తానని ఆయన పేర్కొన్నారు. యువతలో కళలు, సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచడంలో ఆయన కృషి స్ఫూర్తిదాయకం.










