
బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో భౌతికశాస్త్ర అభ్యాసాన్ని సులభతరం చేసే 'ఫిజిక్స్ హబ్' ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్‌ను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులు ఇంటరాక్టివ్ సిమ్యులేషన్స్ సహాయంతో క్లిష్టమైన భావనలను సులభంగా అర్థం చేసుకోగలరు.



















