
తమిళనాడులోని అరుణాచలేశ్వర గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ (మోక్ష మార్గం) గుహలో ఇరుక్కుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికుమార్ (36) అనే భక్తుడు ఊపిరాడక మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.



















