
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి. రామారావు (కేటీఆర్) గారి జన్మదినం సందర్భంగా, బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గారి ఆదేశాల మేరకు, కడం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నల్ల జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు.



















