
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన జాతీయ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్-2026లో విజయవాడకు చెందిన వైద్యురాలు బిందు పరుచూరి డెడ్ లిఫ్ట్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నారు. 84 కేజీల విభాగంలో 147.5 కేజీల బరువెత్తి ద్వితీయ స్థానంలో నిలిచారు.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన జాతీయ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్-2026లో విజయవాడకు చెందిన వైద్యురాలు బిందు పరుచూరి డెడ్ లిఫ్ట్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నారు. 84 కేజీల విభాగంలో 147.5 కేజీల బరువెత్తి ద్వితీయ స్థానంలో నిలిచారు.

హింసాత్మక నిరసనల్లో పాల్గొనేవారిపై కఠిన వైఖరి అవలంబించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. అల్లర్లలో పాల్గొన్నట్లు తేలితే, ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు వారి పాస్‌పోర్టులను రద్దు చేసే ప్రక్రియను కూడా ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఒక తల్లి కామంతో ఆలోచించిన కుట్ర, అనుమానంతో ఊగిపోయిన భర్త కిరాతకానికి ఒక యువతి బలి అయింది. కన్న తల్లి కామాంధురాలిగా మారితే, యువకుడైన భర్త అక్రమ బంధానికి బానిసయ్యాడు. ఫలితంగా, వారి పాపానికి ఆ కూతురే బలి అయింది. పడకగదిలోనే ఆరడుగుల సమాధిగా మారిన ఈ ఘోరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో, పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం, దోషులు 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఆధార్ కార్డు అనేది అత్యంత కీలకమైన గుర్తింపు ధృవీకరణ పత్రం. ఇందులో మీ నివాసం, మొబైల్ నంబర్, పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. ఏవైనా తప్పులుంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యా వ్యవస్థలోని సమస్యల పరిష్కారం, పోలీసుల దాడులను నిరసిస్తూ ఎన్ఎస్యూఐ (NSUI)తో పాటు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు ముధోల్ నియోజకవర్గం, నిర్మల్ జిల్లాలో విశేష స్పందన లభించింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్‌కు సహకరించాయి.

ఏఐఎస్ఎఫ్ (విద్యార్థి సంఘాలు)ల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జూనియర్, డిగ్రీ కళాశాలల బంద్ విజయవంతమైంది. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమని, నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి బాధ్యత వహించి ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ యువజన విభాగం ముధోల్ మండల అధ్యక్షుడు జాదవ్ రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం ముధోల్ మండలంలోని పలు గ్రామాల్లో బంద్ విజయవంతంగా నిర్వహించారు.

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని బీఆర్ఎస్ యువజన విభాగం ముధోల్ మండల అధ్యక్షుడు జాదవ్ రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం ముధోల్ మండలంలోని పలు గ్రామాల్లో బంద్ నిర్వహించారు.

సోనాల మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం–2లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అమ్మ చేతి తొలి ముద్ద' కార్యక్రమాన్ని బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల అనీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పౌష్టికాహారం అందించి, వారి ఆరోగ్య సంరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

ఖానాపూర్ పట్టణంలో వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తగా వార్డులలో దోమల ఫాగింగ్ స్ప్రే పిచికారీ చేయిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ ప్రారంభించారు.

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే. తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని సోనాల మండలంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. వ్యవసాయ క్షేత్రంలో రైతులే స్వయంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

కడెం–దస్తురాబాద్ మండలాల ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం కడెం మండలంలోని కేరళ పాఠశాలలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.

ఖానాపూ పటటణానికి చెందిన కాలి ిశక పిషటామక ఖగపూ ఐఐటలో పేశం సాధించాడు. శాంినగ కాలనకి చెందిన ిశక, ెసట బెంగాలలోని ఖగపూలో ఉనన ఇండియన ఇనసటిటయూట ఆఫ టెకనాలజలో సటు సంపాదించాడు. ఈ ాో అని కుటుంబ సభయులు, సనేహిులు, సథానికులు ఆనందం యకం చేసుననాు.

తెలంగాణ ప్రభుత్వం మీసేవ కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా మార్చాలని నిర్ణయించింది. మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) సహకారంతో ఈ ప్రక్రియ చేపట్టనుంది. దీని ద్వారా చిన్న వ్యాపారాలకు తక్కువ ఖర్చుతో డిజిటల్ ప్రకటనలు చేసుకునే అవకాశం లభిస్తుంది.

భూగర్భ జలాల మట్టాన్ని పెంచడమే జలసిరి కార్యక్రమం ప్రధాన లక్ష్యమని భోరజ్ మండల వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ అష్రఫ్ అహ్మద్ తెలిపారు. రాంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జలసిరి గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించి భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.

ఉప సర్పంచ్ల డిస్టిక్ ఫోరంలో జనరల్ సెక్రెటరీగా నూతి గాడి రంజిత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను తోటి ఉప సర్పంచ్‌లు ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో గంగారెడ్డి, ముత్యం, శ్రీకాంత్, రవీందర్, శ్రీనివాస్, రవి, మహేష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ఖానాపూర్ మండల స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక దిలావర్పూర్ లోని బద్ది పోచమ్మ ఆలయంలో శుక్రవారం జరిగింది. ఈ ఎన్నికల్లో బికునూరి రవి అధ్యక్షులుగా, తుమ్మనపల్లి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా కార్యవర్గాన్ని వీరే ప్రకటించనున్నారు.

కడెం దస్తురాబాద్ ప్రైవేట్ పాఠశాలల TRASMA (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. కడం లోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు.

నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌తో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్ మోహన్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద బాబాసాహెబ్ డా. అంబేద్కర్ విగ్రహం వద్ద బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.