
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పిలుపు

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పిలుపు

ఓరుగల్లు మట్టి బిడ్డ, ఉద్యమ సహచరుడు, మాజీ శాసనసభ్యులు స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డి సంతాప సభలో ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

ఖానాపూర్‌కు చెందిన ఒడ్డేపల్లి కృష్ణంరాజు ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల భర్తను కోల్పోయిన బాధిత కుటుంబానికి మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను ఆయన అందజేశారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సారంగాపూర్ మండల కేంద్రంలో హిందూ యువ సమ్మేళనం నిర్వహించారు. యువతలో దేశభక్తి, జాతీయ చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు.

వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీల్లో మురుగునీటి నిర్వహణ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.29.20 కోట్ల నిధులను మంజూరు చేసింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.

ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ సిద్దులగుట్ట నవనాథ స్వామి ఆలయాన్ని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని, అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వేల్పూర్ రెవెన్యూ శివారులో గల శ్రీ శ్రీ శ్రీ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమంలోని శివాలయంలో స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సర ఆషాడ ద్వాదశి సోమవారం పరమేశ్వరుని జన్మ నక్షత్రం కలిసి రావడంతో, ఆలయ అర్చకులు జన్మంచి ప్రవీణ్ కుమార్ పంతులు ఆధ్వర్యంలో శివలింగానికి మహాన్యాస రుద్రాభిషేకం, అన్నపూజ (అన్నాభిషేకం) శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, సారంగాపూర్ మండల బాధ్యులు పొద్దుటూరి సతీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేసేలా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు.

దుమ్ముగూడెం మండలం సింగవరం గ్రామంలో చేపల పెంపకం యూనిట్‌ను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సోమవారం ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి సంస్థ, భద్రాద్రి క్రాంతి విలాస్, మండల సమైక్య నిర్మాణం సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.

కామారెడ్డి జిల్లా పోచారం రాంపూర్ తండా గ్రామంలో బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే తీజ్ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. గత కొన్ని రోజులుగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకల్లో బంజారా యువతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చిన్నంబావి మండల పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం రూ.33,03,828 విలువైన ఆర్థిక సహాయాన్ని అందించారు.

డీఎస్సీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మంగళగిరిలో పార్టీ ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామంలో గిరిజన మహిళల కోసం ఏర్పాటు చేసిన టైలరింగ్ సెంటర్‌ను భద్రాచలం నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సోమవారం ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

లోకేశ్వరం మండల బిజెపి నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు జన్మదినోత్సవాన్ని బైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బీసీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ రంగాల్లో ఎదిగినప్పుడే వారికి నిజమైన న్యాయం జరిగినట్లు అవుతుందని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని బీసీ సంఘ భవనంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కల్వరాల గ్రామానికి చెందిన సర్దార్ మియా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలిసి, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం పెబ్బేరు పట్టణంలోని ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.

నేరేడిగొండ మండలం కుప్టి వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి నిర్మల్‌లోని దేవేందర్ రెడ్డి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను న్యాయవాది పంద్రం శంకర్ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

చేపూర్ఆర్మూర్లోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించేలా బోనాల వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.

రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ ఘటనలో మృతి చెందిన అలంపూర్ నియోజకవర్గానికి చెందిన మెడికో డాక్టర్ ప్రియాంక మృతదేహాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఖానాపూర్ మండల ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు మానవతా దృక్పథంతో తమ ఐక్యతను చాటుకున్నారు. గోసంపల్లి గ్రామానికి చెందిన గడ్డం ప్రసాద్ వైద్య ఖర్చుల నిమిత్తం సంఘం తరఫున 5,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు.